CM Revanth Reddy: హైదరాబాద్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం, మూసీ నది పునరుద్ధరణ వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు. శాసన మండలి వేదికగా మాట్లాడిన ఆయన, నగర అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు.
Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో
హైదరాబాద్ మహానగరంతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్, వర్షాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సీఎం అన్నారు. హైదరాబాద్ ను చారిత్రాత్మక నగరంగా అభివర్ణిస్తూ.. మానవ తప్పిదాల వల్లే సమస్యలు పెరిగాయని అన్నారు. ఇక నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్లను మూడు వర్గాలుగా విభజించడం, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, సిగ్నల్ వ్యవస్థ తగ్గింపు, మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు, “ఆపరేషన్ రోప్” అమలు వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇకమారో వైపు హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించింది. రూ.24 వేల కోట్లతో 74 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్ట్ కు మెట్రో కనెక్టివిటీ కల్పించే లక్ష్యం వంటి కేంద్ర సూచనలతో మెట్రోను ముందుకు తీసుక బోతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో జైపాల్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమైందని సీఎం గుర్తుచేశారు. నిర్లక్ష్యం కారణంగా దేశంలో హైదరాబాద్ మెట్రో ర్యాంక్ 12 పడిపోయిందని అన్నారు.
అలాగే నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమలను నగర బయటకు తరలిస్తున్నామని సీఎం తెలిపారు. సుమారు 9 వేల ఎకరాల భూమి అందుబాటులోకి తీసుక వచ్చి మల్టీ యూజ్ జోన్లుగా అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే అపార్టుమెంట్ల నిర్మాణంతో గృహావసరాలకు పరిష్కారం, మూసీ నది పునరుద్ధరణ వంటి విషయాలపై ఫోకస్ చేసినట్లు తెలిపారు. మూసి నది అభివృద్ధిపై సీఎం మాట్లాడుతూ.. గంగా, సబర్మతి నదుల తరహాలో మూసీని కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిపక్షాలకు ప్రాజెక్టును అడ్డుకోవద్దని, సలహాలు ఇవ్వాలి కానీ రాజకీయాలు చేయొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.
