CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే అంతర్జాతీయ ప్రమాణాల రవాణా సౌకర్యాలు అవసరమని, ఆ ఆలోచనతోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ నిర్ణయం యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ, అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి తీసుకున్నారని గుర్తు చేశారు.
ప్రారంభంలో రూ.15 వేల కోట్ల అంచనాతో మెట్రో పనులు చేపట్టారని.. 2017 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లారని సీఎం తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక ప్రాంతాల పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో 2014 నుంచి 2017 వరకు నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఫలితంగా 2020 నాటికీ ప్రాజెక్టు పూర్తికాలేదని, గౌలిగూడ ప్రాంతంలో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని చెప్పారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లకు చేరిందన్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
మెట్రో విస్తరణ విషయంలో గత ప్రభుత్వం ప్రజల అవసరాల కంటే కొందరు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించిందని రేవంత్ విమర్శించారు. ప్రజలకు అవసరమైన ప్రాంతాలకు మెట్రో విస్తరణ జరగలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిందన్నారు. మెట్రో ఫేజ్-2కు అనుమతులు, నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను పలుమార్లు కోరామని తెలిపారు. ఎల్ అండ్ టీ సంస్థను కూడా విస్తరణకు ఒప్పించే ప్రయత్నం చేశామని, అయితే గత ప్రభుత్వ విధానాల కారణంగా తమకు రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని చెబుతూ సంస్థ సహకరించలేదని వివరించారు. రూ.13,600 కోట్ల అప్పుతో పాటు భారీ వడ్డీ భారం కారణంగా నష్టాల్లో ఉన్నామని ఎల్ అండ్ టీ చెప్పిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఫేజ్-2కు ముందుగా ఎల్ అండ్ టీ అనుమతి తీసుకురావాలని సూచించిందని, మళ్లీ చర్చలు జరిపినా సంస్థ అంగీకరించలేదని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రానికి వివరించగా, ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తులను కొనుగోలు చేయాలని సూచించిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు అంగీకరించిందని తెలిపారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తులను రూ.15 వేల కోట్లకే కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించామని సీఎం వెల్లడించారు. ప్రతి ఏడాది సుమారు రూ.400 కోట్ల నష్టం వస్తున్నందున సంస్థ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించిందన్నారు. అలాగే రూ.13,600 కోట్ల అప్పును తక్షణమే చెల్లించడం ద్వారా వడ్డీ భారం తగ్గించవచ్చని వివరించారు.
తక్కువ వడ్డీకి రుణాలు పొందేందుకు ప్రయత్నించామని.. ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC)తో చర్చలు జరిపామని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 11.5 శాతం వడ్డీకి భారీగా అప్పులు తెచ్చుకుందని ఆరోపించిన సీఎం.. తాము కేవలం 4 శాతం వడ్డీకి రుణం పొందేందుకు అనుమతులు సాధించామని చెప్పారు. దీంతో మెట్రో ప్రాజెక్టు మొదటి రోజునుంచే లాభదాయకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో నిధుల విడుదలను నిలిపివేసిందని రేవంత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖతార్‌లో జరిగిన సమావేశాల్లో జోక్యం చేసుకున్నారని పేర్కొంటూ.. తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మెట్రో విస్తరణకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
కేంద్ర భాగస్వామ్యం అవసరం లేదని, కనీసం ఎన్వోసీ (NOC) ఇచ్చి ప్రాజెక్టును ముందుకు సాగనివ్వాలని తాను కోరానని సీఎం తెలిపారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు. మెట్రో విస్తరణకు సంబంధించిన నిధుల విడుదల విషయంలో కిషన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం సహకరించాలని సీఎం డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..