Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Ragi Roti Recipe: ‘రాగి’ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యం. ఇందులో కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాగితో చేసే రొట్టెలు ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వంటి పదార్థాల సువాసనతో తయారయ్యే ఈ రాగి రొట్టెలు వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్‌గా వీటిని ఆస్వాదించవచ్చు. మరి ఈ హెల్తీ ఫుడ్ ను ఎలా చేయాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు
* నీరు – 1 కప్పు
* ఉప్పు – తగినంత
* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
* కొత్తిమీర – చిన్న కట్ట (సన్నగా తరిగినది)
* కరివేపాకు – 3 రెమ్మలు (సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి – 2
* అల్లం – 1 అంగుళం ముక్క (తురిమినది)
* క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు
* క్యాప్సికం – అర ముక్క (సన్నగా తరిగినది)
* నూనె – అవసరమైనంత
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
తయారీ విధానం:
పిండిని సిద్ధం చేసుకోవడం:
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీరు తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. అందులో వేడి నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం నీరు పోయకుండా జాగ్రత్తపడాలి. వేడి నీటితో కలపడం వల్ల రాగి పిండి కొద్దిగా మగ్గి రొట్టెలు మెత్తగా వస్తాయి.
కూరగాయలు కలపడం:
పిండి కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికం వేసి బాగా కలపాలి. అవసరమైతే మునగాకు, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలను కూడా జోడించవచ్చు.
రొట్టెలు తయారు చేయడం:
అన్ని పదార్థాలు బాగా కలిసేలా పిండిని కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పలుచగా ఉండకూడదు. రొట్టె తట్టుకునే విధంగా మెత్తగా ఉండాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని పిండి ముద్ద తీసుకోవాలి. బట్టర్ పేపర్ లేదా తడి గుడ్డపై ఉంచి చేత్తో రొట్టె ఆకారంలో పలుచగా తట్టాలి. చివర్లు పగలకుండా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత రొట్టె మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇవి రొట్టె బాగా కాలడానికి సహాయపడతాయి.
రొట్టెలు కాల్చడం:
పెనాన్ని బాగా వేడి చేసి, బట్టర్ పేపర్ సహాయంతో రొట్టెను పెనం మీద వేయాలి. ఫ్లేమ్‌ను లో నుంచి మీడియం వరకు ఉంచి కాల్చాలి. రొట్టెలో చేసిన రంధ్రాల వద్ద కొద్దిగా నూనె వేయాలి. ఒక వైపు బాగా కాలిన తర్వాత మరో వైపు తిప్పి రెండువైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. వేడి వేడిగా ఉన్న రాగి రొట్టెలను కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఉల్లిపాయతో లేదా నేరుగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!