Rashmika Mandanna : రష్మిక మూవీకి ‘A’ సర్టిఫికెట్… త్వరలోనే థియేటర్లలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna : సినిమా విడుదలకు ముందే సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా వేడెక్కుతోంది రష్మిక మందన్న నటించిన బోల్డ్ మూవీ ‘కాక్టెయిల్ 2’. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ను యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ పొందడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతున్న ‘కాక్టెయిల్ 2’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్ కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రేమను కొత్తగా చూపించబోతుందనే ప్రచారం నడుస్తోంది.
2012లో వచ్చిన హిట్ మూవీ ‘కాక్టెయిల్’ సినిమాకు ఇది సీక్వెల్ గా రాబోతోంది. అయితే సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు వచ్చిన సెన్సార్ అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఈ సర్టిఫికెట్ పెద్దల కోసం మాత్రమే ఉద్దేశించిన కంటెంట్‌కు ఇస్తారు. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రష్మిక మందన్న కెరీర్‌ను పరిశీలిస్తే, ఆమెకు ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన చిత్రాలు చాలా అరుదు. గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అనిమల్’ చిత్రానికి కూడా ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ‘కాక్టెయిల్ 2’ కూడా అదే జాబితాలో చేరడం విశేషంగా మారింది. దీంతో రష్మిక కెరీర్లో ‘అనిమల్’ తర్వాత ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన రెండో చిత్రంగా ఇది నిలిచింది.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
మరోవైపు షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నల కలయిక కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ముఖ్యంగా రష్మిక పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఇప్పుడు అందరి దృష్టి బాక్సాఫీస్ ఫలితాలపైనే ఉంది. ‘అనిమల్’ తర్వాత మరోసారి బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రంతో రష్మిక ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో, ‘కాక్టెయిల్ 2’ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ ఈ సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకువచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Tags
- cinema
- Rashmika Mandanna
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!