NTV Telugu Site icon

Revanth Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ భేటీ..కీలక అంశాలపై చర్చ

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులను సీఎం కలిశారు.
ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో సమావేశం కానున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. నేడు అధిష్టానం పెద్దలతో పలు అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్ష మార్పు, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ వంటి అంశాలపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం.

READ MORE: Shamshabad: శంషాబాద్ ఘన్సీమియాగూడ గుర్తుతెలియని జంతువు సంచారం..భయాందోళనలో జనాలు

కాగా.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న (24వ తేదీన) కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేష్ షెట్కా్‌ర్ ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. 2024-25 ఆర్థిక సంవ‌త్సరంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్షల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్టణ వ్యవ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థలాల్లో 25 ల‌క్షల ఇళ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింద‌ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ఖ‌ట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ఆయ‌న నివాసంలో క‌లిశారు. రాష్ట్రంలో తాము నిర్మించ‌ద‌ల్చిన 25 ల‌క్షల ఇళ్లలో 15 ల‌క్షలు ఇళ్లు, ప‌ట్టణాభివృద్ధి సంస్థల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని, వాటిని ల‌బ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగ‌త ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) ప‌ద్థతిలో నిర్మించ‌నున్నట్లు కేంద్ర మంత్రికి వివ‌రించారు.