Site icon NTV Telugu

CM Ramesh: టీడీపీ, బీజేపీ పొత్తు..! సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు..

Cm Ramesh

Cm Ramesh

CM Ramesh: రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, మిత్రత్వం ఉండదు అన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.. ఇక, ఏపీలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు బీజేపీ ఎంపీ.. ప్రజలకు మేలు చేసే పలు చట్టాలు చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూడా మద్దుతిచ్చిందని గుర్తుచేశారు. అయితే, రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పార్టీలు చట్టాలకు మద్దతు ఇవ్వడం వేరు.. రాజకీయాలు వేరన్నారు.

Read Also: Anand Mahindra: “12th ఫెయిల్” ఐపీఎస్ జంట ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆనంద్ మహీంద్రా..

ఇక, దేశమంతటా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ హవా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉందన్నారు ఎంపీ సీఎం రమేష్‌.. బీజేపీ దేశంలో బలంగా ఉంది.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసిందన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జరిగిన నా సమావేశంలో కూడా ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చాయని వెల్లడించారు. మరోవైపు పార్టీ అధినాయకత్వం ఆదేశిస్తే లోకసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ చేసిన సంచలన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version