Anand Mahindra: “12th ఫెయిల్” ఐపీఎస్ జంట ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆనంద్ మహీంద్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra: ‘12th ఫెయిల్’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు. యూపీఎస్‌సీ క్లియర్ చేయడానికి, ఐపీఎస్ కావడానికి ఓ సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన, 12వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనే ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్ర పోషించిన విక్రాంత్ మాస్సే నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
Read Also: Delhi: తప్పిపోయిన కొడుకు 22 ఏళ్లకు తిరిగొచ్చాడు.. ఆ తర్వాత ఏం షాకిచ్చాడంటే..!
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ఇదిలా ఉంటే, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. తాజాగా ఈ రోజు ఆయన రియల్ 12th ఫెయిల్ జంట ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఆయన భార్య శ్రద్ధా జోషిని కలిశారు. వారి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ‘‘ వారు నిజమైన నిజ జీవిత హీరోలు. ఈ రోజు లంచ్ సమయంలో వారిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. భారత్ ప్రపంచ శక్తిగా మారాలంటే ఎక్కువ మంది ప్రజలు వారి జీవన విధానాన్ని అవలంభిస్తే అది మరింత వేగమవుతుంది. వారిని కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాను’’ అని ఆయన ఎక్స్‌లో రాశారు.
They were shy when I requested them for their autographs, which I am proudly holding.
But they are the true real-life heroes Manoj Kumar Sharma, IPS and his wife Shraddha Joshi, IRS. The extraordinary couple on whose lives the movie #12thFail is based.
Over lunch today, I… pic.twitter.com/VJ6xPmcimB
— anand mahindra (@anandmahindra) February 7, 2024
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..