NTV Telugu Site icon

CM Ramesh: అది నిరూపిస్తే పోటీనుంచి తప్పుకుంటా.. సీఎం రమేష్‌ ఓపెన్‌ ఛాలెంజ్..

Cm Ramesh

Cm Ramesh

CM Ramesh: తన ప్రత్యర్థులకు బహిరంగ సవాల్‌ విసిరారు బీజేపీ నేత సీఎం రమేష్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాపై బ్యాంకు రుణాల ఎగవేత, ఫోర్జరీ కేసులు ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆ కేసులు తనపై ఉన్నట్టు నిరూపిస్తే స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుంటాను అంటూ ఛాలెంజ్‌ చేశారు. నేను నామినేషన్ వేసిన ప్రతీసారీ ఇటువంటి ప్రచారాలు చేయడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇక, కేంద్రం నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన ఓ ఐఆర్ఏస్ అధికారి ద్వారా రాష్ట్రంలో వ్యాపార సంస్థల పై తనిఖీలు చేయిస్తూ ప్రభుత్వం భయాందోళనలకు గురి చేస్తోందన్నారు. స్టేట్ DRI అనే వ్యవస్థకు చట్ట బద్ధత లేదన్న ఆయన.. ప్రభుత్వం ఆదేశాలతో వ్యాపారులను భయపెడుతున్న IRS అధికారిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాను అని తెలిపారు. మరోవైపు.. సీఎం రమేష్ ఉత్తరాంధ్ర ప్రజలకు మరో ఎర్రన్నాయుడు లాంటి వాడు అని తనను తానే అభివర్ణించుకున్నారు సీఎం రమేష్.. చోడవరంలో టైల్స్ యజమానిని ధర్మ శ్రీ వేధిస్తుంటే ఆడ్డుకున్నానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో స్థానికతకంటే సమర్ధత కే ఓటు అని నినదించారు సీఎం రమేష్‌.

Read Also: Karnataka: కాంగ్రెస్ నేత ఇంట్లోనే “పాకిస్తాన్” ఉంది.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

కాగా, ఏపీలో సాండ్, ల్యాండ్, గ్రావెల్ మాఫియాపై దాడులు చేయాలని అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న సీఎం రమేష్ సూచించిన విషయం విదితమే.. రాజకీయ నాయకుల ఒత్తిడితో ప్రజలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.. ఇక, అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకు వస్తే తక్షణమే స్పందిస్తానని సీఎం రమేష్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.