Site icon NTV Telugu

Bihar: సీఎం స్పీచ్కు అడ్డుతగిలిన యువకుడు.. ఎందుకో తెలుసా..?

Cm Nitish

Cm Nitish

బీహార్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఎం నితీష్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు హైసెక్యూరిటీ జోన్‌లోకి దూసుకు వచ్చాడు. దీంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని విచారించింది.

Read Also: Prem Kumar: నిర్మాత‌గా ఈ జ‌ర్నీ నాకెంతో సంతోషాన్నిచ్చింది: నిర్మాత శివప్రసాద్ పన్నీరు

అతనిని ముంగేర్ జిల్లాకు చెందిన నితీశ్ మండల్‌(26)గా పోలీసులు గుర్తించారు. ఓ పోస్టర్‌ను పట్టుకొని దూసుకు వచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. యువకుడి తండ్రి రాజేశ్వర్ పాశ్వాన్ బిహార్ మిలిటరీ పోలీసు విభాగంలో పనిచేస్తూ.. 1996 ఎన్నికల సమయంలో డ్యూటీలోనే మృతి చెందారని నితీశ్ మండల్ తెలిపాడు.

Read Also: YSRCP: విజయవాడలోని మూడు స్థానాలకు అభ్యర్థులు వీరే.. సజ్జల ప్రకటన

ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిని కలిసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని యువకుడు తెలిపాడు. చాలా రోజులుగా వేచి చూస్తున్నానని, కనీసం ఇలాగైనా వెళ్తే ముఖ్యమంత్రి దృష్టిలో పడి, తనకు ఉద్యోగ సమస్య తీరుతుందని తనకు కొంతమంది చెప్పారని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పాడు. తన తండ్రి చనిపోయినప్పుడు తాను మైనర్ బాలుడినని, అందుకే అప్పుడు ఉద్యోగం రాలేదన్నాడు. అయితే అతను కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేసే ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు గుర్తించారు. సీఎం సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు.

Exit mobile version