Prem Kumar: నిర్మాతగా ఈ జర్నీ నాకెంతో సంతోషాన్నిచ్చింది: నిర్మాత శివప్రసాద్ పన్నీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prem Kumar Producer Shiva Prasad Panneeru Interview: సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమ్ కుమార్’ను సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ మూవీ ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివప్రసాద్ పన్నీరు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
Chiranjeevi: అనిల్ సుంకరకు చిరంజీవి భరోసా?
Also Read
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
- Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన 'రాజా శివాజీ'.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
నిర్మాతగా జర్నీఎలా ఉంది? అని అడిగితే డిఫరెంట్ బ్యాగ్రౌండ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టానని, మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం అని అన్నారు. నెమ్మదిగా బిజినెస్ ప్రారంభించా, 10 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉంటున్నా, సాధారణంగా బిజినెస్ రంగానికి, సినీ రంగానికి చాలా తేడా ఉంది అని అన్నారు. ఎంటైర్ సినీ జర్నీలో క్రియేటివ్ థాట్స్‌కి, బిజినెస్‌కి చాలా తేడాలుంటాయి, వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడకు ముందుకు పోవాలని నాకు అర్థమైంది. నిర్మాతగా ఈ జర్నీ నాకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ‘ప్రేమ్ కుమార్’ కథాంశాన్నే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు? అని అడిగితే నిర్మాతగా ప్రేమ్‌కుమార్ నా తొలి సినిమా, పరిమితమైన బడ్జెట్‌లో మంచి ఎంటర్‌టైన్మెంట్ మూవీ చేయాలని అనుకున్నాను అని అన్నారు. అందువల్ల చాలా కథలు విన్నాం, సంతోష్ కూడా ఎప్పుడు ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా చేయలేదు, అందుకనే ఈ కథను సెలక్ట్ చేసుకున్నాం, అన్నీ పాత్రల్లో పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది అని అన్నారు. పెళ్లి అనేది స్క్రిప్ట్‌లో ఓ భాగం మాత్రమే, సంతోష్ శోభన్, అభిషేక్ నాకు చాలా మంచి స్నేహితులు, వారి కోసం ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పటికీ సబ్జెక్ట్‌లో దమ్ము కనిపించింది అని అన్నారు. అందుకనే ముందుకు అనుకున్న బడ్జెట్ కంటే కథ డిమాండ్ మేరకు కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టే సినిమా చేశాం అన్నారు శివ.
నిర్మాతగా తొలి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? అని అడిగితే బేసిగ్గా నేను చాలా సాఫ్ట్ పర్సన్, ఏదైనా సమస్య వస్తే అరిచి గొడవపడటం చేయనని, ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతుందని నమ్ముతానని అన్నారు. సమస్య మనకు అర్థమైతే పరిష్కారం సులభంగా తెలిసిపోతుంది, ఈ సినిమా విషయానికి వస్తే మా మధ్య గొడవలేం జరగలేదు, క్రియేటివ్ జర్నీలో అభిప్రాయ బేదాలనేది సాధారణంగా జరుగుతుంటాయి,స్నేహితులం కాబట్టి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లామని అన్నారు. ‘ప్రేమ్ కుమార్’మూవీ కథలో మీ ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటి? అని అడిగితే కథ నాకు బాగా నచ్చిందని అన్నారు. 30-35 కథలు విన్నాం, హీరో, దర్శకుడు ఎవరనేది ముందుగానే ఫిక్స్ అయ్యాం, దాని మీదనే ఫస్ట్ నుంచి వర్కవుట్ చేసుకుంటూ వచ్చాం అని అన్నారు. చాలా విశ్లేషణలు తర్వాత ‘ప్రేమ్ కుమార్’ కథ అయితే సరిపోతుందనిపించింది, ఎందుకంటే సాధారణంగా మన సినిమాల్లో హీరో హీరోయిన్ పెళ్లి సమయంలో పారిపోవటమే, ఫైట్ చేసి కలిసిపోవటమే జరుగుతుంటుంది అని అన్నారు. అది ఎక్కువగా హీరో హీరోయిన్స్ కోణంలోనే చూపిస్తూ వచ్చారు, మరి పెళ్లి పీటల మీదున్న పెళ్లి కొడుకు పాయింట్‌ను ఎవరూ చూపిచలేదు, ఉన్నా ఏ ఒకట్రెండు సినిమాల్లోనే చూసుంటారు. ఆ పాయింట్ నాకు ఆసక్తికరంగా అనిపించింది, పెళ్లి ఆగిపోయినప్పుడు ఆ యువకుడు మానసికంగా ఎలాంటి బాధను అనువిస్తాడు? అతని కుటుంబానికి వచ్చే సమస్యలు ఏంటి? అనే దాన్ని ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్‌లో చూపించాం.
హీరోగా సంతోష్ శోభన్ మాత్రమే ఎందుకని అనుకున్నారు? అని అడిగితే సంతోష్ శోభన్ బ్రిలియంట్ యాక్టర్, తను భవిష్యత్తులో చాలా పెద్ద హీరో అవుతాడు అని అన్నారు. ప్రతీ నటుడికి ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నాకు తెలిసి ఈ ‘ప్రేమ్ కుమార్’ సినిమా తన బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే సినిమా, రేపు సినిమాను చూసిన తర్వాత తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అంటారు. ఇంతకు ముందు తను చేసిన సినిమాల కథలు తన చుట్టూ జరిగితే .. ‘ప్రేమ్ కుమార్’ సినిమా మాత్రం సంతోష్ క్యారెక్టర్‌ను బేస్ చేసుకునే నడిచే కథ, సంతోష్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను, మేం నా ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులతో కలిసి సినిమా చూశాం. అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది అని అన్నారు. హీరోయిన్స్ గురించి చెప్పమంటే హీరోయిన్స్ రాశీ సింగ్, రుచిత సాధినేని అద్భుతంగా నటించారు, దర్శకుడు అభిషేక్ వీరిద్దరినీ సెలక్ట్ చేసుకున్నారు. ప్రభావతిగారు, అశోక్‌గారు ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను మనం లైవ్‌లో చూసినట్లే అనిపిస్తుంది అని అన్నారు. నెక్ట్స్ మూవీస్ ఏంటి అని అడిగితే స్నేహితుల కోసమే సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశాను, మా గ్రూపులోనే 10 -12 మంది ఉన్నారని వారిలో డైరెక్టర్స్, రైటర్స్ ఉన్నారని అన్నారు.. అందరికీ ఓ బేస్ కావాలని స్టార్ట్ చేశాం, ఈ జర్నీలో దీన్ని ఇంకా పెద్దదిగా కొనసాగించవచ్చుననే నమ్మకం కలిగింది, లాక్ డౌన్ సమయంలో మా టీమ్‌తో కలిసి 40 కథలను సిద్ధం చేశాం, అందులో 10 కథలు బౌండెడ్ స్క్రిప్ట్స్‌తో రెడీగా ఉన్నాయని డిఫరెంట్ జోనర్ మూవీస్‌లో సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు శివ ప్రసాద్.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!