హర్యానా అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం విజయం సాధించింది. మంగళవారం అనూహ్యంగా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. అనంతరం కొన్ని గంటల్లోనే నయాబ్ సింగ్ సైనీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత ప్రమాణం చేయించారు.
తిరిగి మరికొన్ని గంటల్లోనే హర్యానా శాసనసభలో నయాబ్ సింగ్ సైనీ విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. ఈ ఫోర్ట్ టెస్టులో సైనీ సర్కార్ విక్టరీ సాధించింది.
హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మెజారిటీ మార్క్‌కు 46 మంది ఎమ్మెల్యేల అవసరం. JJPకి 10, INLDకి 1, కాంగ్రెస్‌కు 30, ఇండిపెండెంట్‌కి 7, HLPకి 1 ఎమ్మెల్యే ఉన్నారు.
జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విశ్వాస పరీక్షలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా కూడా మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది.
తాను సామాన్యమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని.. మా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని సైనీ తెలిపారు. తాను కేవలం బీజేపీ పార్టీ కార్యకర్త మాత్రమేనని.. కానీ ఈ రోజు తనకు ఇంత పెద్ద అవకాశం లభించిందన్నారు. ఇలాంటి అవకాశం బీజేపీ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుందని అసెంబ్లీలో సైనీ పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుర్తుచేశారు. అలాగే ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో కూడా ఖట్టర్ సలహాల మేరకు ముందుకు సాగుతానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు కొన్ని వర్గాల ఓట్లు కొల్లగొట్టేందుకే హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను మార్చి సైనీకి బాధ్యతలు అప్పగించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా స్థానాలు సాధిస్తుందని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే బుధవారం బీజేపీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాలో దాదాపుగా 90 మంది అభ్యర్థులను ప్రకటించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
#WATCH | CM Nayab Singh Saini-led Haryana Government wins the Floor Test in the State Assembly. pic.twitter.com/0D78XmtbqQ
— ANI (@ANI) March 13, 2024