మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నేడు బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళ పాలన ఎలా ఉందో మీకు తెలుసునన్నారు. తెలంగాణలో రైతుల గురించి అద్భుతంగా పని చేశామని, రైతు బంధు వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు సీఎం కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు సహాయం చేయలేదని, రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వమే కొంటుందన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు కట్టే పన్నుల డబ్బులని కేసీఆర్ వృథా చేసి రైతు బంధు ఇస్తున్నారని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, రైతు బంధు వృథానా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!
అంతేకాకుండా.. ‘రైతు బంధు ఉండాలి..అది 16 వేలు కావాలి అంటే బీఆర్‌ఎస్ గెలవాలి. 24 గంటల కరెంట్ వెస్ట్ అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఎవ్వరిని అడిగినా 24 గంటల కరెంట్ కావాలని అంటున్నారు. రేవంత్ మాత్రం 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. ఇంకా 10HP మోటార్ పెట్టుకోవాలి అంటున్నారు. రాహుల్ గాంధీ ధరణిని తీసివేస్తాం అంటున్నారు. ధరణి ఉంది కాబట్టే రైతు బంధు వస్తుంది. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు ఎలా వస్తుంది. ధరణి పోతే మళ్ళీ పాత కాలం మళ్ళీ వస్తుంది. ధరణి తీసేస్తే భూముల కబ్జాలు, పైరవీలు మళ్ళీ పెరుగుతాయి. మూడు సంవత్సరాలు కష్టపడి ధరణి తెచ్చాము. భూముల ధరలు పెరిగాయి..ధరణి లేకుంటే ఎన్నో గొడవలు జరిగేవి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఒరేయ్ సన్నాసి మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు. కులాలు, మతాలు అనే ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం. సునీతా లక్ష్మా రెడ్డిని అభ్యర్థిగా పెడుదాం అన్నప్పుడు మదన్ రెడ్డి సహకరించారు. మదన్ రెడ్డి నా చిరకాల మిత్రుడు ఆయనకి సముచిత స్థానం కల్పిస్తాం. బీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ. అన్ని మతాలను, సంప్రదాయాలను బీఆర్‌ఎస్ గౌరవిస్తుంది.’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : CM KCR : మానవీయ కోణంలో ఆలోచించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం