NTV Telugu Site icon

CM KCR: బీఆర్‌ఎస్సే రాష్ట్రానికి శ్రీరామరక్ష.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్ధే లక్ష్యం

Kcr Speech

Kcr Speech

CM KCR: ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలని కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తమని, పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ రాక ముందు సాగర్‌ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారని.. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్‌ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సింది.. గోల్‌మాల్‌ చేసి దిగువన ప్రాజెక్టు కట్టారన్నారు సీఎం కేసీఆర్.

Also Read: T.Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ” ప్రజలను నమ్ముకునే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించా.. ఆనాడు కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారు కాబట్టి మనం ఇబ్బందులు పడుతున్నాం. సాగర్ ఆయకట్టు కాపాడుకుతాము. రైతులను ఆదుకోవాలని, కాపాడుకోవాలనే గులాబీ జండా కప్పుకున్నా. బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్‌ను గెలిపించాలి. కోదాడ లో బీసీల చైతన్యం చూపించాలి.మల్లయ్య యాదవ్‌కు టికెట్ వద్దని అన్నారు… కానీ నేను టికెట్ ఇచ్చి ఆశీర్వదించినా. అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కావాలని ఎవరూ అడగలేదు.. తెలంగాణ సమాజం గురించి తెలిసిన నేను ఆ పథకాలను ప్రారంభించాను. కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు వద్దు అంటుండు.. కాంగ్రెస్ కావాలో…. BRS కావాలో ప్రజలు తేల్చుకోవాలి.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్దే BRS లక్ష్యం. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్‌ నిర్మిస్తాం. కాళేశ్వరం నీళ్లు రాలేదని భట్టి చెబుతున్నారు. కోదాడకు మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నయి. కాంగ్రెస్‌ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తుంది? ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎలా వస్తాయి?” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.