CM KCR: బీఆర్‌ఎస్సే రాష్ట్రానికి శ్రీరామరక్ష.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్ధే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలని కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తమని, పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ రాక ముందు సాగర్ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారని.. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సింది.. గోల్‌మాల్ చేసి దిగువన ప్రాజెక్టు కట్టారన్నారు సీఎం కేసీఆర్.
Also Read: T.Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ” ప్రజలను నమ్ముకునే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించా.. ఆనాడు కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారు కాబట్టి మనం ఇబ్బందులు పడుతున్నాం. సాగర్ ఆయకట్టు కాపాడుకుతాము. రైతులను ఆదుకోవాలని, కాపాడుకోవాలనే గులాబీ జండా కప్పుకున్నా. బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్‌ను గెలిపించాలి. కోదాడ లో బీసీల చైతన్యం చూపించాలి.మల్లయ్య యాదవ్‌కు టికెట్ వద్దని అన్నారు… కానీ నేను టికెట్ ఇచ్చి ఆశీర్వదించినా. అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కావాలని ఎవరూ అడగలేదు.. తెలంగాణ సమాజం గురించి తెలిసిన నేను ఆ పథకాలను ప్రారంభించాను. కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు వద్దు అంటుండు.. కాంగ్రెస్ కావాలో…. BRS కావాలో ప్రజలు తేల్చుకోవాలి.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్దే BRS లక్ష్యం. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తాం. కాళేశ్వరం నీళ్లు రాలేదని భట్టి చెబుతున్నారు. కోదాడకు మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నయి. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తుంది? ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎలా వస్తాయి?” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
ట్రెండింగ్
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!