CM KCR : నేడు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ స్వల్పకాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. “జాతీయ రైతు దినోత్సవాన్ని” (కిసాన్ దివస్ ) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులకు నేటి స్వరాష్ట్రంలోని రైతు సంక్షేమం వ్యవసాయం పరిస్థితులకు హస్తిమశకాంతరం వున్నదన్నారు. వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవితాలను గుణాత్మక దిశగా అభివృద్ధి పరిచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అత్యద్భుత ఫలితాలనిస్తున్నాయన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆ తర్వాత అనేంతగా, దేశ వ్యవసాయరంగ నమూనా మార్పు ( paradaigm shift) కు తెలంగాణ వ్యవసాయ రంగాభివృద్ధి బాటలు వేసిందని కేసీఆర్ తెలిపారు.
Also Read
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
దండుగలా మారిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నేడు పండుగలా మార్చడంతో పాటు, నేడు దేశానికే అన్నపూర్ణ గా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించడం వెనుక ఎంతో శ్రమ, మేధో మథనం దాగి ఉన్నదని సీఎం తెలిపారు
ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు అడుగడుగునా అడ్డుపుల్ల వేస్తూ, కేంద్రం తన రాజ్యాంగబద్దమైన బాధ్యతను విస్మరించి, తెలంగాణకు ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా, లెక్కచేయకుండా మొక్కవోని పట్టుదలతో అడ్డంకులను అధిగమిస్తూ రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రైతుబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు.
వ్యవసాయరంగంలో సాధించే ప్రగతి సమస్త రంగాలకు చోదకశక్తిగా పనిచేస్తుందని, తద్వారా మాత్రమే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. వ్యవసాయరంగంలో అభివృద్ధిని సాధించడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలు పటిష్టమై గ్రామీణార్థిక వ్యవస్థ బలోపేతమౌతుందని, అది “స్పిన్ ఆఫ్ ఎకానమి” కి దారి తీసి తద్వారా సుస్థిరాభివృద్ధి’ జరుగుతుందని సీఎం అన్నారు. ప్రాథమికరంగమైన వ్యవసాయరంగంలో చోటు చేసుకునే ప్రగతి ద్వారా, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగుతుందని, దాని ప్రభావం, ద్వితీయ, తృతీయరంగాలయిన పరిశ్రమలు తదితర ఉత్పత్తి రంగాలకు, సేవారంగాలకు విస్తరిస్తుందని సీఎం వివరించారు. ఇదే సూత్రాన్ని అనుసరించి సమస్త రంగాల్లో వృద్ధిరేటు వూహించని రీతిలో నమోదవుతూ, అటు తలసరి ఆదాయం, ఇటు జిఎస్డీపీ పెరుగుదల కు దోహదం చేసిందన్నారు.
విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి రంగం తో పాటు పలు వృత్తుల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం వెచ్చించే ఖర్చు, సామాజిక పెట్టుబడిగా పరిణామం చెందుతుందనే శాస్రీకాయ ఆర్థిక విధానాన్ని తన కార్యాచరణ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ఇటువంటి రైతు సంక్షేమ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కెసీఆర్ వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఫలితాలను సాదిస్తున్న తెలంగాణ స్పూర్తితో దేశంలో కిసాన్ సర్కార్ అధికారంలోకి రావాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ ద్వారా మాత్రమే దేశ రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలైన పరిష్కారం లభిస్తుందని సీఎం కేసిఆర్ పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
-
Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!