Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Praised Dr Br Ambedkar

CM KCR : ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బీఆర్ అంబేద్కర్

Published Date :April 4, 2023 , 9:29 pm
By Gogikar Sai Krishna
CM KCR : ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బీఆర్ అంబేద్కర్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డా. బీఆర్ అంబేద్కర్ మహాశయుడు కనబరిచిన దార్శనికత తోనే దళిత గిరిజన బహుజన వర్గాలతో పాటు సకల జనులందరికీ ఆర్థిక,సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందని, ఇందుకోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బీఆర్‌ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు. తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, ప్రత్యేక రాష్ట్రాల కోసం, ఆర్టికల్ 3 ని రాజ్యాంగంలో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి పొందుపరిచారని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు, డా. బీఆర్‌ అంబేద్కర్.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read : statue of Ambedkar: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం..కేసీఆర్‌పై దళిత మేధావులు హర్షం

Also Read

  • Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
  • Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్‌, పీఎస్‌లో ఫిర్యాదు..
  • Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్‌ బాద్‌షా గురించి ఆసక్తికర విషయాలు..
  • Bottle Gourd Moong Dal Cheela Recipe: బ్రేక్‌ఫాస్ట్‌ కోసం కరకరలాడే సొరకాయ-పెసరపప్పు చిల్లా.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!
Add as a preferred
source on google

పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరోదిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం..వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మహానుభావుడు మనలను నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్పూర్తివంతమై దారి చూపుతాడని సీఎం తెలిపారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డా. బీఆర్‌ అంబేద్కర్ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా.. తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు.
దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో,అంబేద్కర్ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా వుండాలని సీఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 14 న అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా జరుపతలపెట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమం.. అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే లు సండ్ర వెంకట వీరయ్య, రసమయి బాలకిషన్, బాల్క సుమన్,విఠల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజని కుమార్, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, సీఎంఓ కార్యదర్శులు భూపాల్ రెడ్డి, స్మితాసబర్వాల్, ఫైనాన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ ఎం డీ ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం స్థాపించాలని నిర్ణయం తీసుకున్న నాటినుంచి, కలకాలం నిలిచే విధంగా సాంకేతికంగా, తయారీ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడాని కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకున్నదని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇందుకు పలు దేశాలు ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని సీఎం తెలిపారు.

’’ నీను వూహించినదానికంటే అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని వున్న అంబేద్కరుడు వొక తాత్విక జ్జానిగా అలరిస్తున్నాడు..’’ అని సీఎం కేసీఆర్ తన ఆనందాన్ని సంతృప్తినీ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విగ్రహ రూపశిల్పి.. 98 ఏండ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్..కృషిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘‘ దేశం గర్వించదగ్గరీతిలో అందరివాడు డా.బీఆర్‌ అంబేద్కర్ మహాశయుని మహా విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నం. ఈ దేశం ప్రజలకోసం భవిష్యత్తు తరాలకోసం రాజ్యంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసా పోరాడిన యోధునిగా వారు చేసిన కృషి, త్యాగం అజరామరం. కేవలం దళితులు,గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలు మాత్రమే కాదు…వివక్షను ఎదుర్కునే ప్రతీ చోటా అంబేద్కర్ ఆశయం సాక్షాత్కారమవుతుంది. అంబేద్కర్ మహాశయుడు విశ్వ మానవుడు. వారి కృషి వొక్కటని చెప్పలేము. వారికి మనం ఎంత చేసుకున్నా తక్కువే. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వారి అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందడమే..’’ అని సీఎం అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే.. రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకున్నామన్నారు.

ఇటువంటి చారిత్రాత్మక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తగు జాగ్రత్తలతో పకడ్బందీగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రం నలు మూలలనుంచి విగ్రహావిష్కరణ కోసం వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి’ అని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వారికి సీఎం పలు సూచనలు చేశారు.

విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు సామాజిక వేత్తలు సామాన్యులు వారి సందర్శనకోసం వస్తారని, ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో వుంచాలని సీఎం తెలిపారు. ఎండాకాలం కావడంతో నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, తాగునీల్లు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ ఏర్పాట్లన్నీ మరో నెల రోజుల పాటు కొనసాగించాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తాను 4 దశాబ్దాల క్రితమే ఎమ్మెల్యేగా వున్నప్పుడు భారత దేశ దళితుల స్థితి గతులను ప్రపంచంలోని అణగారిన వర్గాల తో పాటు పోల్చేతూ అధ్యయనం చేయాలనే తలంపుతో ‘సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ ’ అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సదర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత దేశంలో అంటరాని తనం పేరుతో దుర్మార్గమైన రీతిలో వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతికోసం, వారితో పాటు అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం డా. బీఆర్‌ అంబేద్కర్ మహాశయుడు పడిన శ్రమ కృషి ఆసియా ఖంఢంలోనే మరొకరు చేయలేదని సీఎం స్పష్టం చేశారు.

సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు :
• ఏప్రిల్ 14 న జరిగే.. డా.బీఆర్‌ అంబేద్కర్ విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా,కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపాలి.
• ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత తెలంగాణ ప్రదాత కు ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించాలి.
• గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించాలి.
• 125 అడుగుల డా. బీఆర్‌ అంబేద్కర్ విగ్రహానికున్న భారీ పరదాను తొలగించడానికి,, నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి….అతి పెద్ద క్రేన్ ను ఉపయోగించాలి.
• ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలి.
• ఈ కార్యక్రమానికి.. సచివాలయ సిబ్బంది అధికారులతో పాటు..అన్ని శాఖల హెచ్ వోడీలు, జిల్లా కలెక్టర్లు..రాష్ట్ర మంత్రులు, ఎంపీలు (రాజ్యసభ లోక్ సభ) , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు హాజరుకావాలి.
• ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.
• ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవాలి.
• హైద్రాబాద్ చేరుకునే లోపే 50 కిలోమీటర్ల దూరంలోనే సభకు వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లను చూసుకోవాలి. సభానంతరం తిరిగి వెల్లేటప్పుడు కూడా రాత్రి భోజనం ఏర్పాట్లు చూసుకోవాలి.
• ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర సల్ల ప్యాకెట్లు (విజయ డైరీవారి), లక్షన్నర వాటర్ ప్యాకెట్లు అందుబాటులో వుంచాలి.
• పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం వున్నందున, విగ్రహ చుట్టు పక్కల ప్రాంతాన్ని మొత్తం వినియోగించుకోవాలి. ప్రజలకు ఎండవేడి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేయాలి.
• ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగు బాధ్యతను హైద్రాబాద్ సీపీ తీసుకోవాలి. పార్కింగుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలి.
• సభ రోజు సామాన్య ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను పోలీస్ యంత్రాంగం చూడాలి.
• సంబంధించిన ఏర్పాట్లలో హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, డిజిపి అంజన్ కుమార్, సీపీ సీవి ఆనంద్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శులు అధికారులు బాధ్యత వహించాలి.
• ఈ సందర్భంగా ఘనమైన రీతిలో ఆట పాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. ఇందుకు గిడ్డంగుల శాఖ చైర్మన్, గాయకుడు సాయిచంద్ తో కలిసి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కార్యక్రమాలను రూపొందించాలి.
• అంబేద్కర్ కు సంబంధించిన పాటలను మాత్రమే పాడుతూ, ఆ మహనీయునికి తెలంగాణ సాంస్కృతిక నీరాజనం అర్పించాలి. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ తదితర ముందస్తు సన్నద్దత బాధ్యత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకోవాలి.
• డా.బీఆర్‌ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అధికారిక కార్యక్రమం..కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలి.
• విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డా బీఆర్‌ అంబేద్కర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ను మాత్రమే వొకే వొక ముఖ్య అతిథిని ఆహ్వనించాలని నిర్ణయం.
• అంబేద్కర్ మహాశయుని ఔన్నత్యాన్ని చాటే విధంగా దేశవ్యాప్తంగా ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలి.
• ఇందుకు సంబంధించి మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డిలతో కూడిన కమిటీ తగు చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు విగ్రహావిష్కరణ, సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
• ఈ సందర్భంగా సభికులకు అనువుగా ఎల్ ఈ డీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలి.
• సభికుల కోసం 40 వేల కుర్చీలను ఏర్పాటు చేయాలి.
• ఎంపికే చేయబడిన ఆహ్వానితులు సంబంధిత మేధావులు తదితర ప్రముఖుల కోసం పాస్ లు రూపొందించి జారీ చేయాలి.
• అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించాలి.
• ఏప్రిల్ 14 నాడు మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది.
• ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమౌతుంది. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగం వుంటుంది. అనంతరం ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. తదుపరి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందేశం వుంటుంది. సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ధన్యవాద ప్రసంగంతో సభ ముగుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cm kcr
  • Dr BR Ambedkar
  • latest news
  • telangana news

తాజావార్తలు

  • Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్‌తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!

  • Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!

  • Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..

  • Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు

  • Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్‌, పీఎస్‌లో ఫిర్యాదు..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions