Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Orders To Complete The Loan Waiver

CM KCR: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

Published Date :August 2, 2023 , 6:35 pm
By NTV WebDesk
CM KCR: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రేపటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు.. తదితర కారణాల వల్ల ఆర్థిక లోటుతో ఇన్నా్ళ్లు కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు.

Read Also: J. D. Chakravarthy: కంటెంట్ కాదు డైరెక్టరే కింగ్.. జేడీ చక్రవర్తి హాట్ కామెంట్స్!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో.. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో ఇవాళ (బుధవారం) సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావులు పాల్గొన్నారు.

Read Also: BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. అమెజాన్, గూగుల్కు మీడియా హక్కులు..!

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాఘటంగా కొనసాగిస్తుందని కేసీఆర్ అన్నారు. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు అని సీఎం తెలిపారు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

Read Also: Bandi Sanjay: రేపు ప్రధాని మోడీని కుటుంబ సమేతంగా కలవనున్న బండి సంజయ్

రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమాన్ని రేపటి( ఆగస్టు 3 ) నుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • FORMERS
  • hyderabad
  • loan waiver
  • telangana

తాజావార్తలు

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • CD Gopinath: భారత క్రికెట్‌‌లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. తొలి టెస్ట్ విజేత ‘చివరి యోధుడు’ కన్నుమూత!

  • Shubman Gill Fined: మ్యాచ్ గెలిచినా గుజరాత్‌కు షాక్.. గిల్‌కు భారీ జరిమానా..!

  • Juvvaladinne Boats Missing Mystery issue: ఆ బోట్లు ఎక్కడ..? ఎవరి పాత్ర ఏంటి..?

  • Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..

ట్రెండింగ్‌

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions