Site icon NTV Telugu

CM KCR : 8 ప్ర‌భుత్వాలు కూల‌గొట్టాం. మ‌రో 4 ప్ర‌భుత్వాలు కూల‌గొడుతాం.. ప్రెస్‌మీట్‌లో సంచలన విషయాలు

Cm Kcr

Cm Kcr

ఇటీవల మొయినాబాద్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ ముఠాను ఆపరేట్‌ చేస్తున్నది బీఎల్‌ సంతోష్‌, జేపీ నడ్డా, అమిత్‌షా అని చెప్పారు.. అంత ఓపెన్‌గా చెబుతుంటే ఇంత కన్నా దుర్మార్గం ఏముంటుంది? అని ప్రశ్నించారు. 2016 నుంచి వారి కాల్‌ డేటా మా చేతికొచ్చిందని, ముఠా అరాచకాలన్నీ ఇప్పుడు పబ్లిక్‌ డొమైన్‌లోకి చేరినట్టేనని, మొత్తం 70 వేల పేజీల సమాచారం ఉందన్నారు సీఎం కేసీఆర్‌. మా చేతికి అందిన సమాచారాన్ని అందరికీ పంపించామని, రేపటి నుంచి వందల మంది ఆ సమాచారాన్ని విశ్లేషించే పనిలోనే ఉంటామన్నారు సీఎం కేసీఆర్‌.
Also Read : CM KCR : రాక్షసుల కుట్రను బద్దలుకొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నాం

బీజేపీ దుర్మార్గ‌పు చ‌ర్య‌లను దేశ ప్ర‌జ‌లు, యువ‌త‌, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. రిలీజ్‌ చేసిన వీడియోల్లో నిందితులు.. 8 ప్ర‌భుత్వాలు కూల‌గొట్టాం. మ‌రో 4 ప్ర‌భుత్వాలు కూల‌గొడుతామన్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ‌, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌లో ప్ర‌భుత్వాలు కూల‌గొడుతాం అని ఆ ముఠా స‌భ్యులు పేర్కొన్నారు. దీన్ని రాజ‌కీయం అంటారా? అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్క‌డ మౌనం పాటించారు కాబ‌ట్టి 8 ప్ర‌భుత్వాలు కూలిపోయాయని, తెలంగాణ చైత‌న్య‌వంత‌మైన గ‌డ్డ కాబ‌ట్టి.. ఈ రాక్ష‌సుల కుట్ర‌ను బ‌ద్ద‌లు కొట్టామన్నారు సీఎం కేసీఆర్‌.

Exit mobile version