దొడ్డు బియ్యాన్ని కొనండి : కేంద్రాన్ని కోరిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పర్యటనలో రెండు రోజులుగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే దొడ్డుబియ్యం కొనుగోలుపై కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. దొడ్డు బియ్యం కొనుగోలు అసాధ్యమని, ఇప్పటికే నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈసారికి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు భేటీ కొనసాగింది.అంతకుముందు కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు జరుగుతున్న నష్టం, కృష్ణా జలాల అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, నీటి కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రిని కోరారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ అమలు తేదీ వాయిదాను మరోసారి షెకావత్ వద్ద ప్రస్తావించారు.
ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులనే నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం కోరారు.. మరోవైపు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం అనంతరం కొందరు ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అమిత్ షా లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి భోజనం చేసిన అమిత్ షా నక్సల్స్ సమస్యపై వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!