ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి చెందారు. అయితే..కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు సీఎం కేసీఆర్. శోక తప్పులైన వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ పోషించిన చురుకైన పాత్రను, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ చేస్తున్న సేవలను సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read : Amazon Jungle: పిల్లలు దొరికారు కానీ.. వారిని వెతికిన కుక్క అమెజాన్ అడవుల్లో కనిపించకుండా పోయింది
అయితే.. హన్మకొండలోని స్నేహనగర్‌లోని తన నివాసంలో కుసుమ జగదీష్ ఆదివారం ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఎంత సేపు అయినా ఆయన బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా.. ఆయన శరీరం నల్లగా మారిపోవడం గమనించారు. వెంటనే ములుగు రోడ్‌లో ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. కాగా, వైద్యులు సీపీఆర్ చేసినా ఆయనలో ఎలాంటి కదలిక రాలేదు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో జగదీశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.