Cm JaganMohan Reddy Speech At Vizag Public Meeting :విశాఖలో నిర్వహించిన మోడీ బహిరంగ సభ విజయవంతం అయింది. అయితే ఏపీకి మాత్రం ఎలాంటి హామీలు లభించలేదు. విశాఖలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో జనసముద్రం కనిపిస్తోందని.. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతూ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర జనం.. ప్రభంజనం మాదిరిగా కదిలివచ్చిందని వెల్లడించారు. విజయనగరం వాసి మహాకవి గురజాడ మాటలు కర్తవ్య బోధ చేస్తున్నాయని తెలిపారు. వంగపండు పాట ఏం పిల్లడో ఎల్లమొస్తవా అనే పాటలా జనం తరలివచ్చారు. శ్రీశ్రీ అన్నట్టు జగన్నాథ రథచక్రాలు ఇక్కడికి కదిలి వచ్చాయన్నారు జగన్.
ఇవాళ దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత రాష్ట్రంలో తమ ప్రాధాన్యత అని వెల్లడించారు. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నామని పేర్కొన్నారు.ఏపీలో వనరులు, బడ్జెట్ కి అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గాయాల గురించి బయటపడలేదు. ఏపీకి ఇచ్చే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే రూపాయి బాగా ఉపయోగపడుతుంది.
Read Also: Pm NarendraModi: హామీలు, వాగ్దానాలు లేని మోడీ ప్రసంగం
మీరు చూపే ప్రేమను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు: రాష్ట్రానికి మరిన్ని సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలిపారు. విభజన గాయాల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునఃనిర్మాణానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం.. పార్టీలు, రాజకీయాలకు అతీతమని సీఎం తెలిపారు. తమకు… రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదని స్పష్టం చేశారు. పెద్దమనస్సుతో మీరు చూపే ప్రేమను ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశామన్న సీఎం.. రాష్ట్ర విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి విభజన హామీలు, పోలవరం,విశాఖ రైల్వే జోన్ వంటి వినతుల్ని సానుకూలంగా పరిశీలించాలి. మీ ఆశీస్సులు మాకు కావాలన్నారు జగన్. అంతకుముందు మోడీతో కలిసి వివిధ ప్రాజెక్టుల నమూనాలు పరిశీలించారు.
Read Also: Revanth Reddy: మోడీకి రేవంత్ ఓపెన్ లెటర్.. ఆ హామీలు నెరవేర్చాలని డిమాండ్