NTV Telugu Site icon

Proddatur: ప్రొద్దుటూరుకు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర.. మారుమోగుతున్న సభాప్రాంగణం

Proddatur

Proddatur

Proddatur: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు మూడు నియోజకవర్గాలలో బస్సు యాత్ర ముగిసింది. తొలిరోజు వైఎస్సార్‌ జిల్లా కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేతకు నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనలు అభిమానుల కోలాహలం నడుమ మొదలైన యాత్ర.. సాయంత్రం వీరపనాయునిపల్లి మండలంలో ముగిసింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్లు బస్సుయాత్ర పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. దారి పొడవునా గ్రామాల్లో జనం జననేతకు నీరాజనం పట్టారు. మధ్య మధ్యలో సీఎం జగన్‌ వాహనం పైకి ఎక్కడి అభివాదం చేశారు. అంతేకాదు.. ప్రజలు సమర్పించిన విజ్ఞప్తి పత్రాలను సీఎం స్వీకరించారు.

Read Also: Chandrababu: ఆట మొదలైంది.. ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు..

సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు అశేషంగా కదలివచ్చారు. బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికేందుకు మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి పల్లె ప్రజలు తరలివచ్చారు. జగన్‌ను చూసేందుకు సుదీర్ఘ నిరీక్షణ.. టెంట్లు వేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ దారిపొడవునా సీఎం జగన్‌ కోసం నిరీక్షించారు. రోడ్‌షోలో జగన్‌ను చూసిన వెంటనే హర్షధ్యానాలు, కేరింతలతో జనం స్వాగతం పలికారు. అడుగడుగునా పూలతో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. వెల్లువెత్తిన జనంతో అనుకున్న సమయం కన్నా బస్సుయాత్ర ఆలస్యంగా నడుస్తోంది. కాసేపట్లో ప్రొద్దుటూర్‌ టౌన్‌లో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సీఎం జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.