Cm JaganMohan Reddy: ఆర్ అండ్ బి శాఖపై సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. పంచాయితీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాడైన రోడ్లను పూర్తిగా బాగు చేయాలి.కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలి.రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదు.రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలి.దీనివల్ల క్రమం తప్పకుండా రోడ్లు మెయింటెనెన్స్ అవుతాయి. నిర్వహణకూడా సజావుగా, నాణ్యతతో సాగుతుంది. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు.
నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా పూర్తిచేయాలి.ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని తెలిపిన అధికారులు.ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్) టెక్నాలజీని వాడాలని అధికారులు ప్రతిపాదించారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందన్నారు సీఎం. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో చేపట్టాలన్నారు సీఎం. వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలన్న సీఎం.అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలన్నారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Read Also: Today (23-01-23) Stock Market Roundup: లాభాలకు లక్షా తొంభై కారణాలు
కడప, బెంగళూరు రైల్వేను లైనుపై దృష్టిపెట్టాలన్న సీఎం…విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైన ఫోకస్ పెట్టాలన్నారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలి.ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలి. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి.దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా విష ప్రచారం చేస్తున్నాయి.
పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్ యాప్‌ను సమీక్షా సమావేశంలో ప్రారంభించిన సీఎం. స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం.యాప్ ద్వారా దీనికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేసే అవకాశం.జియో కోఆర్డినేట్స్‌తో పాటుగా ఫిర్యాదు నమోదు.దీనిపై కమాండ్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు.ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే చర్యలు. పట్టణాలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులు నాణ్యతతో జరగాలన్న సీఎం.పట్టణాలు, నగరాల్లో ఎక్కడైనా ఫలానా చోట రోడ్డు రిపేరు చేయాలని పౌరుడు ఫిర్యాదుచేసిన 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలి.ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలన్న సీఎం.యాప్ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.నాణ్యత మీద ప్రత్యేక దృష్టిపెట్టినప్పుడు అవే సమస్యలు ప్రతిసారి రావన్నారు సీఎం జగన్.
ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్న దొర, ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కే వి వి సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: ICC T20 Team: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్లు ఇవే.. ఇండియా నుంచి ఎవరెవరంటే?
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!