NTV Telugu Site icon

CM Revanth Reddy: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. అందులో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతీ మండలంలోని ఎమ్మార్వో, ఏఈవో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని సీఎం తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి.. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకూడదని కలెక్టర్లకు తెలిపారు. అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశించారు.

Read Also: CM Revanth Reddy: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం..

రియల్ భూములు, లే అవుట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలి.. వీటితోపాటు విలేజ్ మ్యాప్‌లను పరిశీలించి అధికారులు ఫీల్డ్‌కు వెళ్లి వీటిని ధ్రువీకరించుకోవాలని అన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని పేర్కొన్నారు. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి.. ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేదని ముఖ్యమంత్రి తెలిపారు.

Read Also: MLC Botsa Satyanarayana: సారీ చెప్పి తప్పించుకోలేరు.. తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..

Show comments