CM Chandrababu: రేపు సోమశిల జలాశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. రేపు(సోమవారం) శ్రీసిటలో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయడంతో పాటు మరో 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అలాగే ఐదు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో భూమిపూజ, ప్రారంభోత్సవాల తర్వాత ఫాక్స్‌కాన్ పరిశ్రమల ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం వివిధ పరిశ్రమల సీఈవోలతో సమావేశం నిర్వహించనున్నారు. శ్రీ సిటీ లో కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సోమశిల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించునున్నారు.
Read Also: Duvvada Vani: మాధురి నుంచి శ్రీనివాస్‌కు ప్రాణహాని.. దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు