నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు.
రేపు సోమశిల జలాశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. రేపు(సోమవారం) శ్రీసిటలో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయడంతో పాటు మరో 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అలాగే ఐదు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో ఏపీలో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో వుంది. రిజర్వాయర్ కి సంబంధించిన ఆరు గేట్లును ఎత్తి 36,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయం పూర్తి నీటి మట్టం 78 టిఎంసి