CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu Warning to Rebels: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న మార్పులు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని, అధికారికంగా బీ-ఫారం పొందిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలని సూచించారు. రెబల్స్‌గా బరిలోకి దిగితే పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ, ప్రతి వర్గానికీ మేలు జరిగేలా మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచేందుకు మరిన్ని సంస్కరణలు చేపడతామన్నారు. రైతులకు ప్రభుత్వ ముద్రణతో కూడిన పట్టాదారు పాస్ బుక్కులు అందిస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాల నిధులను సక్రమంగా వినియోగించలేదని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. చెత్త పన్ను విధించి, చెత్తను రోడ్లపైనే వదిలేశారని ఆరోపించారు. గత పాలనలో జరిగిన విధ్వంసం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందని సీఎం వ్యాఖ్యానించారు.
Also Read
- UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
- Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
- CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
- Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించినప్పుడల్లా కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు జరగకపోతే స్థానిక సంస్థలకు నిధులు అందడంలో ఇబ్బందులు తలెత్తుతాయని, తద్వారా అభివృద్ధి వెనుకబడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పోలీసు వాహనాల్లో తీసుకెళ్లి నామినేషన్లు వేయించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కుప్పం, పిఠాపురం, పులివెందుల, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో నామినేషన్లు బాగానే దాఖలయ్యాయని సీఎం తెలిపారు. ‘వెల్ఫేర్, డెవలప్మెంట్, సర్వీస్, గుడ్ గవర్నెన్స్’ అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పేదల సంక్షేమమే తమ ఆలోచన, తపన అని పేర్కొంటూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. “చెప్పాము.. చేస్తున్నాం.. చేస్తాం” అనేదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
గత రెండేళ్ల పాలనను, గత ప్రభుత్వ పనితీరును విశ్లేషించి స్థానిక ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి వేసిన ఓటు వృథా కాలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి, అభివృద్ధి కొనసాగడానికి ప్రజల మద్దతు అవసరమని అన్నారు. ఈసారి 2024 కంటే ఎక్కువ మెజారిటీతో కూటమికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై అభ్యర్థులకు త్వరలో స్పష్టత ఇస్తామని తెలిపారు. ఈరోజు సాయంత్రం కల్లా అభ్యర్థులందరికీ ఒక స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కూటమి తరఫున బీ-ఫారం పొందిన వారే పోటీలో ఉండాలని, మిగతా ఆశావహులు అధికారిక అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని సూచించారు. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా రెబల్స్ పోటీ చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!