Annadata Sukhibhava: కడప మహానాడులో హామీ ఇచ్చా త్వరలోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనుకున్న ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రారంభించాం. 2028 డిసెంబర్ కల్లా ఫేస్ వన్ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు.. పది లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇస్తామని హామీ ఇచ్చా.. మాట నిలబెట్టుకున్నానా లేదా మీరే చెప్పాలి అని ప్రజలను అడిగారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది.. గాలేరు నగరిని కడప వరకు తెస్తానని హామీ ఇచ్చా రాబోవు సంవత్సరానికి గాలేరు నగరి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. మొదటి దశ రూ. 4500 కోట్లు రెండవ దశ రూ. 11400 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు..
READ MORE: ENG vs IND: టీమిండియాకు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ అవుట్! ఐదవ టెస్ట్ గెలిచినా?
గండికోట అంటే సుందరమైన ప్రదేశమని సీఎం చంద్రబాబు తెలిపారు.. అమెరికాలో గ్రాండ్ కెనాన్ ఉంది. ఇండియాకే గ్రాండ్ కెనాన్ గండికోట.. గండికోటను ఆదర్శవంతమైన ప్రదేశంగా తయారు చేయడానికి రూ. 80 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. కృష్ణదేవరాల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.. ఒంటిమిట్ట కడప దర్గా గండికోట ఈ మూడింటిని అభివృద్ధి చేస్తే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది.. రాయలసీమ రాయలసీమ కాదు రతనాల సీమ అని చేసి చూపిస్తా అన్నారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు తీసుకెళ్లాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.. ఆయన ఆలోచనల నుంచి పుట్టిందే గాలేరు నగరి హంద్రీనీవా ప్రాజెక్టులు అని గుర్తు చేశారు. హంద్రీనీవా పథకానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 3500 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాం.. హంద్రీనీవా పూర్తి చేస్తామన్నారు. హంద్రీనీవా ద్వారా కుప్పానికి కూడా నీళ్లు ఇస్తామని… గండికోటకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే తాను ల్యాండ్ సేకరణ చేశానని సీఎం తెలిపారు. కడపలో పదికి పది సీట్లు గెలిపించాలి రాయలసీమలో ఒక హార్టికల్చర్ అబ్బుగా శ్రీకారం చుట్టామని వెల్లడించారు…
READ MORE: CM Chandrababu: తోక తిప్పితే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..
“కొప్పర్తి ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కులకు 5000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం.. రాయలసీమలో డిఫెన్స్ ,ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ హబ్ గా తయారు చేస్తున్నాం… వేరే ప్రాంతం వాళ్ళందరూ సేమ్ వైపు చూసేలా చేస్తా.. రేపే అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టాం… మేం రూ.14000 ఇస్తాం కేంద్రం రూ. 6000 ఇస్తుంది రెండు కలిపి ఒక్కొక్క రైతుకి రూ. 20 వేల రూపాయలు ఇస్తాం… గత ప్రభుత్వం 12,500 ఇస్తామని 7500 మాత్రమే ఇచ్చారు. రూ. 7500 నుంచి రూ. 14 వేలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వందే.. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలో 90% సబ్సిడీ ఇచ్చాం.. దానిని గత ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ కొనసాగిస్తున్నాం. రూమ్ ద్వారా మందులు కొట్టే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు కల్పిస్తున్నాం. రేపటి నుంచి అన్నదాత సుఖీభవ నిధులను అకౌంట్లలో జమ చేస్తున్నాం..” అని సీఎం చంద్రబాబు వివరించారు.
