CM Chandrababu: గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం చంద్రబాబు!
- కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు అంశంపై సమీక్ష
- గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం
- వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సుకు చంద్రబాబు
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్‌లైన్ విధానంలో ఈ సమీక్షకు హాజరుకానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. ఆశ్రమంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.
సీఎం చంద్రబాబు సచ్చిదానంద స్వామి ఆశ్రమం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సుకు సీఎం హాజరవుతయారు. ఈ సదస్సు సీఎం మాట్లాడనున్నారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం పాలనా అంశాలపై మంత్రులతో సీఎం ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’.. రైతులు, మత్స్యకారులకు ఇచ్చే రూ.20వేల ఆర్థిక సాయంపైన చర్చ జరిగింది.
తాజావార్తలు
-
LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!
-
Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!
-
కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!
-
Iran-US Talks: ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ
-
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
ట్రెండింగ్
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!