CM Chandrababu: తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారు.. ఎప్పుడూ రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారని, ఎప్పుడూ కూడా తాను రెగ్రేట్ ఫీల్ అవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదన్నారు. 2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైందని, 2024లో కూటమి ప్రభుత్వం రాగానే బ్రాండ్ ఏపీని పునరుద్ధరించాం అని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఏమేం చెప్పామో అవన్నీ చేస్తున్నామని, 2025-26లో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారుచేశామని సీఎం చెప్పుకొచ్చారు. సీఎం ఈరోజు ఆర్థిక శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు.
‘ఆర్థిక శాఖలో రెండు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఎలాంటి ఎఫర్ట్ పెట్టామనేది అందరికి తెలియాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఇదొక చారిత్రాత్మక ప్రెసెంటేషన్. పాలన బాగుంటే ప్రజల మీద పెద్ద ప్రభావితం చేస్తుంది. నెగటివ్ గవర్నన్స్ ఉంటే నెగటివ్ ప్రభావం చేస్తుంది. 2024లో ఒక అఖండ విజయం సాధించాం. 2019-24లో విధ్వంస పాలన సాగింది. ప్రజలందరూ భయంతో బ్రతికారు. 1982 ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక విప్లవం.. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చాయి. 2024లో ఊహించని విప్లవం.. ఒక బాధ్యతతో ఎప్పడికప్పుడు ప్రోగ్రెస్ ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాము’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Also Read
‘2014లో బస్సులో ఉండి పరిపాలించాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణించాల్సి వచ్చింది. తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎక్కడా కూడా రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు. 2014-19 లో ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మ్ంచుకోవాల్సిన పరిస్థితి లో ఉన్నాము. 2019 లో వచ్చిన పాలనకి ప్రజలు బయటకి రావటానికి భయపడ్డారు. రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి, అభివృద్ధి కుంటుపడింది. 2024 ఎన్నికల్లో ఏవి చెప్పామో అవి చేస్తున్నాము. ఊపిరి పిల్చుకోలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం డేట్స్ వారీగా అన్ని అమలు చేస్తున్నాము’ అని సీఎం తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!