ప్రతి ఎమ్మెల్యే నెలకు ఒక రోజు రైతుల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసు కోవాలన్నారు సీఎం చంద్రబాబు. వచ్చే నెల నుంచి రైతులకు సంబంధించి తక్షణ కార్యాచరణ ప్రారంభిస్తాం అని ప్రకటించారు. తాను ఐటీపై మాట్లాడితే ఐటీ వ్యక్తి అనుకుంటారని, కానీ రైతుల కోసమే ఎక్కువ ఆలోచిస్తా అన్నారు సీఎం. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని, రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం అని…
ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అరటి, మిరప, మామిడి, పూలు, టమాటో, బత్తాయి, ఆయిల్‌పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హార్టీకల్చర్‌ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్ కావాలని ఆకాక్షించారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు.…