Site icon NTV Telugu

CM Chandrababu : ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu

Chandrababu

CM Chandrababu : రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.50 కోట్లను విడుదల చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇంధన వాడాకాన్ని తగ్గించేందుకు నూరు శాతం ఎల్ఈడి దీపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు వీధి దీపాల నిర్వహణకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదన్నారు. సాంకేతికతను వినియోగించి వీధి దీపాల నిర్వహణను మానిటరింగ్ చేసి విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఈడీ దీపాలు వినియోగించడం ద్వారా విద్యుత్ మిగులను 30 నుండి 60 శాతం వరకూ పెంచ వచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గత తెలుగు దేశం హయాంలో చేపట్టిన బెస్ట్ పాలసీలను మళ్లీ అమల్లోకి తెచ్చి ఇంధన సామర్థ్యంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్నారు. రాష్ట్రంలోని 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని, అందుకోసం ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వీధి దీపాల నిర్వహణతో పాటు సమర్ధ విద్యుత్ వినియోగానికి సంబంధించి నివేదిక ఇచ్చేందుకు ఆర్ధికశాఖ, ఇంధన శాఖతో పాటు ఈఈఎస్ఎల్ ప్రతినిధులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సిఇఓ విశాల్ కపూర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎనర్జీ ఎఫిషియెన్సీ అంశాలకు సంబంధించి వివిధ అంశాలను సియంకు వివరించారు.

  Breaking News: పాదయాత్రలో కేజ్రీవాల్‌పై దాడి.. బీజేపీ పనే?

ఈఈఎస్ఎల్ తో ప్రభుత్వం అవగాహనా ఒప్పందం
రాష్ట్రంలో 1.5 లక్షల గృహాలకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఉపకరణాలతో విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇఇఎస్ఎల్ సంస్థతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL), ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇఇఎస్ఎల్, హౌసింగ్ కార్పొరేషన్‌తో సమన్వయంతో అదనంగా మరో 9 లక్షల ఇళ్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి పి.నారాయణ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి జానకి, సియం కార్యదర్శి ప్రద్యుమ్న, ఎండి జెన్కో చక్రధర్ బాబు, ఎపి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ సిఇఓ విశాల్ కపూర్,ఇతర ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Viral Video: షోరూం ముందే కాలిపోయిన ఓలా స్కూటర్..

Exit mobile version