Site icon NTV Telugu

CM Chandrababu: కుప్పంలో మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!

Cm Chandrababu

Cm Chandrababu

చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని సీఎం ఎస్పీ తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.

Also Read: Pedhi : డిజిటల్ రైట్స్ డీల్‌తో సంచలనం సృష్టించిన ‘పెద్ది’..

నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప.. అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక తిమ్మరాయప్ప ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. తిమ్మరాయప్ప భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ.. బెంగళూరులో కూలి పనులు చేస్తూ కుమారుడిని పోషిస్తున్నారు. అయితే సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకొని.. డబ్బు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version