CM Chandrababu: కుప్పంలో మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!
- చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన
- మహిళను రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి దాడి
- కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని సీఎం ఎస్పీ తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు.
Also Read: Pedhi : డిజిటల్ రైట్స్ డీల్‌తో సంచలనం సృష్టించిన ‘పెద్ది’..
Also Read
నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప.. అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక తిమ్మరాయప్ప ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. తిమ్మరాయప్ప భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ.. బెంగళూరులో కూలి పనులు చేస్తూ కుమారుడిని పోషిస్తున్నారు. అయితే సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకొని.. డబ్బు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!