CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఉన్న పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్ వద్ద బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి సీఎం నివాళులర్పించారు. ఇటీవల అమెరికాలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూయడంతో పార్థివ దేహాన్ని విజయవాడకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ బాలసుబ్రహ్మణ్యం పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పోలీసు శాఖలో సుమారు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ఆయన.. రాష్ట్రంలో ఈ-ప్రగతి, ఆర్టీజీఎస్ వంటి కీలక వ్యవస్థల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. సాంకేతికతపై ఆసక్తితో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడానికి కృషి చేశారు.
బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన హఠాన్మరణం అత్యంత బాధాకరమని అన్నారు. పదవీ విరమణ చేసిన రెండు నెలలకే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం విచారకరమని పేర్కొన్నారు. క్యాన్సర్‌తో పెద్ద యుద్ధమే చేసిన బాలసుబ్రహ్మణ్యం.. చికిత్స పొందుతున్న సమయంలోనూ విధులు నిర్వహించారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సమయంలో బాలసుబ్రహ్మణ్యం ఎంతో బాధపడ్డారని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సేవ పట్ల తన నిబద్ధతను కొనసాగించారన్నారు. ఆర్టీసీ ఎండీగా ఆయన సమర్థవంతంగా పనిచేశారని సీఎం కొనియాడారు.
Also Read
- ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
- Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
- Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
పోలీసు శాఖలో బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఉమ్మడి ఏపీలో జగిత్యాలలో ఎస్పీ, సమస్యాత్మక ప్రాంతాలలో బాలసుబ్రహ్మణ్యం పని చేశారు. టెక్నాలజీపై ఆయనకు ఉన్న ఆసక్తి ప్రభుత్వ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడింది. ఈ ప్రగతి వ్యవస్థను తీసుకువచ్చి చక్కగా పని చేశారు. ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేసి బాలసుబ్రహ్మణ్యం సంస్కరణలు తెచ్చారు. పోలీసు శాఖకు వన్నె తెచ్చిన వ్యక్తి, ప్రజాహితం కోసం పని చేసిన వ్యక్తి సుబ్రహ్మణ్యం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!