CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంత వరకు చేయగలరో చేయాలని… జిల్లా స్థాయిలో క్రమబద్దీకరణ కుదరని పక్షంలో కేబినెట్‌కు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ”రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్య చాలా కాలంగా పెండింగులో ఉందన్నారు సీఎం చంద్రబాబు… ఏదో ఒక రకమైన సాకు చూపి వాటిని పెండింగులో పెట్టేస్తున్నారన్నారు.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. ప్రతీ జిల్లాలో క్రమబద్దీకరించాల్సిన ఇళ్లు, ఇళ్ల స్థలాల జాబితాను సిద్ధం చేయాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోండి. క్రమబద్దీకరణకు సంబంధించి జిల్లాల స్థాయిలో ఎంత వరకు చేయగలిగితే.. ఆ మేరకు చేసేయాలి. అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే… కేబినెట్లో పెట్టి వాటి క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకుంటాం. ఎటువంటి వివాదాలు లేకుండా క్రమబద్దీకరించ దగ్గ స్థలాలను ప్రతీ కేబినెట్‌కు తీసుకురావాలి. అప్పటికీ పూర్తి కానివి ఏమైనా ఉంటే… ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించేలా ఆలోచన చేద్దాం. ఇక గృహ నిర్మాణ శాఖలో పెండింగులో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టాలి. ఈ మేరకు గృహ నిర్మాణం – ఆర్థిక శాఖలు సమన్వయం చేసుకోవాలి.”అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్య కారకులపై కఠిన చర్యలు
“ఇసుక అక్రమాలు అస్సలు జరగడానికి వీల్లేదు. ఏపీలో తవ్విన ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదు. రాష్ట్రాల సరిహద్దులు దాటిన వాహనాలను సీజ్ చేయండి.. ఈ విషయంలో కఠినంగా ఉండండి. ఇసుక లారీలను ట్రాకింగ్ పెట్టాలి. ఈ మేరకు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఇసుక అక్రమంగా వేరే ప్రాంతాలకు వెళ్తే… వెంటనే అలర్ట్ మెసేజ్ వచ్చేలా మెకానిజం ఉండాలి. ఇప్పటికే 50 వేల వాహనాలకు జీపీఎస్ పెట్టి ట్రాకింగ్ చేస్తున్నాం.. అక్రమాలు జరగడానికి వీల్లేదు. ఈ మేరకు మైనింగ్-పోలీసులు కో-ఆర్డినేట్ చేసుకోవాలి. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వం అందించే ప్రతీ పథకం, అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కలిగితే.. ప్రభుత్వం అందించే సేవలకు సార్ధకత లభిస్తుంది. ప్రజల్లోకి వెళ్లాలని… ప్రజలకు వివరించాలని చెప్పేది ప్రచారం కోసం కాదు… ప్రజలకు అవగాహన కల్పించడానికే అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ సేవల పట్ల అవగాహన కలిగితే… ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి పెరుగుతుంది. రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్య ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. వర్క్ ప్లేసులో వేధింపులు ఉండకూడదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. సమస్యలు ఉత్పన్నం అయ్యాక చర్యలు తీసుకోవడం కాదు… సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి.”అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి పార్థసారథి, సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
తాజావార్తలు
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
-
EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!