YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు వైద్యులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపు నిలిచిపోయిన పరిస్థితులపై వైద్యులు ఆయన దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందకపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు అవసరమైన వైద్య చికిత్స పొందలేకపోతున్నారని, చికిత్సల కోసం అవసరమైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లను పారదర్శకంగా జారీ చేయడం లేదని జగన్‌కు వివరించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించామని జగన్ పేర్కొన్నారు. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే కాలంలో కూడా రోగులకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు.
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!