EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO EDLI Scheme: ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక భద్రతా ప్రయోజనాలను అందిస్తోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, PF ఖాతా ఉన్న ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీని పొందే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం ద్వారా లభిస్తుంది.
EPFO 1976లో ప్రారంభించిన EDLI పథకం, ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకంలో సభ్యులైన ఉద్యోగులు ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. బీమా ప్రీమియాన్ని పూర్తిగా యజమాని సంస్థే భరిస్తుంది. ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Salary) మరియు డీఏ (Dearness Allowance) మొత్తంలో 0.50 శాతం ప్రీమియంగా సంస్థ చెల్లిస్తుంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ పథకం ప్రకారం, EPFO సభ్యుడు ఉద్యోగంలో ఉన్న సమయంలో అకాల మరణం చెందితే, అతని లేదా ఆమె నామినీకి కనీసం రూ.2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా మొత్తాన్ని అందజేస్తారు. దీంతో కుటుంబ సభ్యులకు అత్యవసర సమయంలో ఆర్థికంగా కొంత భరోసా లభిస్తుంది. EDLI ప్రయోజనం పొందాలంటే ఉద్యోగి మరణానికి ముందు కనీసం 12 నెలల పాటు ఉద్యోగంలో కొనసాగి ఉండాలి. ఈ కాలంలో ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినా, PF ఖాతా యాక్టివ్‌గా ఉంటే ఈ బీమా ప్రయోజనానికి అర్హత కొనసాగుతుంది. అయితే ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణించిన సందర్భంలో మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.
ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు మరియు ఫారం 5IFను సంబంధిత PF కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి. అవసరమైన పత్రాల పరిశీలన అనంతరం బీమా మొత్తం నామినీ ఖాతాలో జమ అవుతుంది. EPFO సభ్యులు తప్పనిసరిగా తమ UAN పోర్టల్‌లో ఇ-నామినేషన్ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నామినీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా భవిష్యత్తులో కుటుంబ సభ్యులు క్లెయిమ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా PF ఖాతా కేవలం పదవీ విరమణ నిధి మాత్రమే కాదని, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే ఉచిత బీమా కవచంగా కూడా పనిచేస్తుందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!