WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- వాతావరణ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- ప్రమాదకర ఎల్‌నినో రాబోతుందంటూ వార్నింగ్
- ఈ ఏడాది వర్షాలు తక్కువ ఉంటాయని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలోకి ప్రమాదకరమైన ఎల్‌నినో రాబోతుందని.. దీంతో రుతుపవనాలు బలహీనపడతాయని వార్నింగ్ ఇచ్చింది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వడగాలులు, కరవులు ఏర్పడతాయని.. ఇక భారతదేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని సూచించింది.

Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
వాస్తవానికి గతేడాది మే నెల మధ్యలోనే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవడంతో నదులు, భూగర్భ జలాలు సంపూర్ణంగా నిండాయి. దీంతో పాడి పంటలు సమృద్ధిగా పండాయి. కానీ ఈ ఏడాది ఇంకా తొలకరి పలకరించలేదు. ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి.
ఇలాంటి తరుణంలో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) నుంచి వెలువడిన ఒక కీలక నివేదిక ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలను, విధాన రూపకర్తలను అప్రమత్తం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని డబ్ల్యూఎంఓ అధికారికంగా ధృవీకరించింది. ఈ కాలానుగుణ మార్పు రాబోయే నెలల్లో ప్రపంచ ఉష్ణోగ్రత, వర్షపాత సరళిని పూర్తిగా మార్చివేయనుంది. శాస్త్రవేత్తల అంచనా నమూనాల ప్రకారం.. 2026 ఎల్ నినో ఒక సాధారణ సంఘటనగా ఉండబోదని.. బదులుగా అది ‘మితమైన నుంచి చాలా బలమైనదిగా’’ ఉండే అవకాశం ఉందని సూచించింది.
భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలోని అసాధారణంగా వెచ్చని జలాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇప్పటికే వేడెక్కుతున్న ప్రపంచానికి ఎల్ నినో మరింత ఆజ్యం పోస్తుందని హెచ్చరిస్తూ ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇవి వేగంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వ్యవసాయాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నారు.
ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దక్షిణాసియాలో రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) స్పష్టం చేసింది. భారతదేశం వంటి వ్యవసాయ దేశానికి రుతుపవనాలు జీవనాధారం. బలహీనమైన రుతుపవనాల ప్రభావం పంట ఉత్పత్తి, నీటి లభ్యత, ఆహార భద్రతపై నేరుగా పడుతుంది. తగ్గిన వర్షపాతం కరవుకు దారితీసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!