CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ‘పొదుపు’ పిలుపునిచ్చారు. ప్రధాని సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ, తన సొంత కాన్వాయ్ నుంచే పొదుపు చర్యలను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లా పర్యటనల సమయంలో ఉండే భారీ కాన్వాయ్‌లను 50 శాతం మేర కుదించాలని డీజీపీ మరియు ఇంటెలిజెన్స్ చీఫ్‌తో జరిగిన భేటీలో ఆయన పేర్కొన్నారు. కేవలం భద్రతా ప్రోటోకాల్‌కు అవసరమైన వాహనాలను మాత్రమే ఉంచి, మిగిలిన వాటిని తొలగించాలని సూచించారు. దీనివల్ల ఇంధన ఆదాతో పాటు, సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రులు, వీఐపీలకు సూచనలు..
ఈ పొదుపు చర్యలు తనకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని మంత్రులు, ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించాలని చంద్రబాబు కోరారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని, అది దేశ భక్తికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
ప్రధాని మోదీ సూచనలతో ఇప్పటికే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ కాన్వాయ్‌లను కుదించుకోవాలని నిర్ణయించారు. వారి బాటలోనే పయనిస్తూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలో కొత్త ఒరవడికి నాంది పలికింది. రేపటి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఖర్చులను మరింత తగ్గించేలా, ఇతర పొదుపు మార్గాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సామాన్య ప్రజల పక్షాన ఉంటూ, దేశ ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా తన సౌకర్యాలను తగ్గించుకుంటున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!