AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు…
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జుల నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు.