CM Chandrababu: ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెరగాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు
- అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో సీఎం సమావేశం..
- ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు..
- ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో సమావేశమైన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచాలంటూ అధికారులను ఆదేశించారు.. ముఖ్యంగా ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు.. ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం… సచివాలయంలో జరిగిన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈవో కె. దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలన్నారు సీఎం చంద్రబాబు.
Read Also: CM Chandrababu: 1/70 చట్టం రద్దుపై సీఎం కీలక ప్రకటన.. దానికి కట్టుబడి ఉన్నాం..
Also Read
ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనేదానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని, ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. ఫైళ్లలో ఆర్థిక, ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లుంటాయని, ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు చంద్రబాబు. ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటు మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్సు అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈఓ తెలిపారు. మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్య అవుతున్నాయని చెప్పారు…కార్యదర్సుల సమావేశంలో మొదటి సెషన్ లో ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి చర్చ జరిగింది.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!