ఏపీలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుని చాలా రోజులు అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒత్తిడి నుంచి టూరిజం బయటపడేస్తుందన్నారు. పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న సీఎం.. జ్యోతి ప్రజ్వలన చేసి టూరిజం దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. “లక్షల కోట్ల వ్యాపారం టూరిజం రంగంలో ఉంది. సరైన మార్కెటింగ్ చేస్తే భారత్ లో టూరిజం ఎంతో అభివృద్ధి చేకూరుతుంది. కమ్యూనిజం.. క్యాపిటలిజం ఇలా అన్నీ అయిపోయాయి.. మిగిలింది టూరిజమే. వ్యవసాయం తర్వాత టూరిజంలోనే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతోంది. ఏపీలో టెంపుల్ టూరిజానికి ఎక్కువ స్కోప్ ఉంది. అతిథి దేవోభవ అనేది మన సంప్రదాయం.. ఇదే టూరిజం థీమ్. టూరిజానికి మార్కెటింగ్ చాలా ముఖ్యం. 974 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉంది. అనేక సంస్కృతులు, ఆలయాలు, బౌధ్దారామాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, అభయారణ్యాలు ఉన్నాయి. వేంకటే శ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. ఇటీవల తిరుమల కూడా కాంట్రావర్సీ అయింది. దేవాలయాల్లో సంప్రదాయాలని గౌరవించాలి. చట్టాలను అమలు చేయాలి.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: MS Dhoni: జార్ఖండ్ రోడ్లపై ఎంఎస్.ధోనీ బైక్ రైడింగ్.. వీడియో వైరల్
దేవునికి నైవైద్యం కోసం పెట్టడం కోసం యానిమల్ ఫాట్ ఉన్న కల్తీ నెయ్యి తెప్పించి అపచారం చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ దేవాలయంలోనైనా అపచారం జరగ్గకుండా చూసే బాధ్యత తమదన్నారు. “పరిశుభ్రమైన వాతావరణం, ప్రశాంతత ఉంటే ఒకరోజు ఉండే వారు.. రెండు రోజులు ఉంటారు. ప్రశాంతంగా పుట్టపర్తికి వచ్చి సాయిబాబా ప్రవచనాలు.. ప్రశాంతత ఉండటంతో వారం రోజులు ఉందామనుకునే వారు ఆరు నెలల వరకు ఉండేవారు. వరదల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే రూ. 420 కోట్లు విరాళాలుగా వచ్చాయి. మంచితనం బతికే ఉందని దాతలు నిరూపించారు. టెంపుల్, ఎకో, ఎడ్వంచర్ టూరిజంని డెవలప్ చేయాలి. లంబసింగి, పాపికొండలు, కోనసీమ వంటి సుందర ప్రదేశాలు ఉన్నాయి. బీచ్ ఫెస్టివల్స్ ద్వారా బీచ్ టూరిజం పెరిగేలా చేయొచ్చు. త్వరలో సీ-ప్లెయిన్ బెజవాడకు రాబోతోంది. రుషికొండకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ వచ్చింది.. మిగిలిన పర్యాటక ప్రాంతాలకూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు వచ్చేలా ప్రణాళికలు. ఉద్యోగాలు చేయడం కాదు.. ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి. శ్రీశైలం, సూర్యలంక వంటి వాటికి ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లుగా మారుస్తాం. రాష్ట్రం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. ప్రశాంత వాతవరణం ఉండేలా చర్యలు. గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా ఉండే ఇళ్లు ఉన్నాయి.. వాటినీ టూరిజం స్పాటులుగా చేసుకోవచ్చు.” అని పేర్కొన్నారు.
READ MORE:Zomato: సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా రాజీనామా.. కారణమిదే..!
త్వరలో టూరిజానికి పరిశ్రమ హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. “త్వరలో టూరిజం పాలసీ రూపొందిస్తాం. ఏపీలో మొత్తంగై 3 వేల రూంలు మాత్రమే ఉన్నాయి. ఒక్క హైదరాబాదులో ఉన్న రూంలు.. ఏపీలో ఉన్నాయి.. దీన్ని మరింతగా పెంచుకోవాలి. టెక్నాలజీని వినియోగించుకుంటే పని సులువుగా అవుతుంది. పెద్ద ఎత్తున వరద వచ్చినా.. అంటు వ్యాధులు ప్రబలకుండా చూడగలిగాం. ప్రజలు మళ్లీ అటు ఇటు చూడకుంటే.. ఏపీ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారుతుంది. నేను ఓ భూతంతో పోరాడుతున్నా.. దాన్ని బయటకు పంపాల్సి ఉంది. మన ఊరుకు వచ్చిన టూరిస్టును అలాగే చూడాలి. టూరిజం ఫ్రెండ్లీగా ప్రజలు ఉండాలి. ఈ ఏడాది నుంచే ఏపీ గురించే మాట్లాడుకునేలా టూరిజం అభివృద్ధి చెందాలి.” అని తెలిపారు.