CM Chandrababu Nidadavolu visit: నిడదవోలులో సీఎం చంద్రబాబు పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Nidadavolu visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రజా వేదిక సమావేశం, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన, పార్టీ కార్యకర్తల సమావేశం వంటి పలు కార్యక్రమాలతో సీఎం బిజీ షెడ్యూల్ కొనసాగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 11:00 గంటలకు నిడదవోలు పట్టణంలోని ఎం.వి నగర్ మారుతి లేఅవుట్ సమీపంలో ఉన్న St. Ambrose School వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు స్వాగతం పలకనున్నారు.
Read Also: Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
Also Read
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
- ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
- Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
- Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
తర్వాత ఉదయం 11:15 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 11:20 గంటలకు సుబ్బారాజుపేట – సింగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమ స్థలానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1:15 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 గంటల మధ్య మలకోడు సరస్సు ప్రాంతానికి చేరుకుని అక్కడ నీటిమొక్కలు (వాటర్ హైసింత్) నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన చేయనున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజలతో సీఎం పరస్పర చర్చలు జరపనున్నారు. తరువాత మధ్యాహ్నం 2:30 గంటలకు నిడదవోలు పట్టణంలోని సెయింట్ అంబ్రోస్ పాఠశాల సమీపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిడదవోలు నుంచి బయలుదేరి, సాయంత్రం 4:45 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిడదవోలులో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!