Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
- గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
- రష్యా ఆయిల్ కొనుగోలుకు మినహాయింపు..
- భారత్ మరింత రష్యా ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం..
- మరోవైపు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Oil: ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అల్లాడింది. ఇప్పుడు ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తానని చెప్పడంతో చమురు రవాణాకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా చమురుపై అమెరికా మరోసారి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. గతంలో ఇచ్చిన మినహాయింపును పొడగించేది లేదని అమెరికా ట్రెజరీ స్వయంగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వచ్చింది. తాజా నిర్ణయంతో భారత్ మరింత రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఏర్పడింది.
Read Also: Iran-US Talks: ఇరాన్-అమెరికా తదుపరి చర్చలపై అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!
Also Read
ఏప్రిల్ 17 నుండి అమల్లోకి వచ్చే మినహాయింపుల కోసం అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఒక కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం, మే 16 వరకు దేశాలు రష్యా చమురు,పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. దాదాపుగా ఒక నెల పాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చు. ఈ వార్త భారత్‌కు శుభపరిణామం. రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల ఇంధన ధరలు స్థీరికరించబడుతాయి. గతంలో అమెరికా ఇచ్చిన 30 రోజుల మినహాయింపు ఏప్రిల్ 11న ముగిసింది. ఈ సమయంలో మరోసారి అమెరికా రష్యన్ ఆయిల్ విషయంలో యూటర్న్ తీసుకుంది.
మరోవైపు, ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తామని ప్రకటించిన వెంటనే చమురు ధరలు 10 శాతం పడిపోయాయి. ప్రపంచ చమురు, గ్యాస్‌లో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత ఇరాన్ ఈ మార్గాన్ని దిగ్భందించింది. దీంతో ప్రపంచ చమురు రంగం సంక్షోభంలో పడింది. ఇప్పుడు ఇరాన్, అమెరికా వరస నిర్ణయాలతో ప్రపంచంలో చమురు సమస్య తప్పింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?