CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK) ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు అత్యంత పారదర్శకంగా, వేగంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ‘కొందరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం ప్రైవేటీకరణ కాదు’ అని సీఎం తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (PSK) విధానం వల్ల పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ ఎంత సులభతరమైందో, అదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. ఈ విధానం ద్వారా ప్రజలకు మధ్యవర్తుల ప్రమేయం, వేధింపులు లేకుండా నేరుగా సేవలు అందుతాయని భరోసా ఇచ్చారు. కొత్త విధానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల సామాన్య ప్రజలకు కలిగే లాభాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా వివరించాలని కోరారు.
Also Read
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
ఈ మార్పుల వల్ల ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్న డాక్యుమెంట్ రైటర్లకు సీఎం చంద్రబాబు పెద్ద ఉపశమనం కలిగించారు. “డాక్యుమెంట్ రైటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి ఉపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రత్యామ్నాయంగా మెరుగైన ఆదాయ మార్గాలు చూపే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది” అని సీఎం హామీ ఇచ్చారు. సాంకేతికతను జోడించి వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్‌కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!