Site icon NTV Telugu

AP CM Chandrababu: రేషన్‌ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన

Cbn In Collectors Conferenc

Cbn In Collectors Conferenc

AP CM Chandrababu: ఏపీ సెక్రటేరియట్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖలపై ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ద్వారంపూడి ఫ్యామిలీ రేషన్ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ధరల నియంత్రణ కోసం ప్రత్యేక జేసీని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ధాన్యం సేకరణ విషయంలో చాలా కాలంగా ఉన్న విధానం మంచిదేనని.. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో డబ్బులు ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉండకూడదని.. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలన్నారు.

Read Also: CM Chandrababu: ప్రత్యేకంగా సీటు వేయాలా?.. కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ

మిల్లెట్లను ప్రమోట్ చేయాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌ ద్రవ్యోల్భణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధరలు పెరగకూడదనే గతంలో రైతు బజార్లు ఏర్పాటు చేశామని.. రైతు బజార్లు, ధరల నియంత్రణ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో జేసీని పెట్టాలని ఆదేశించారు. రేషన్ డిపోల్లో గతంలో రకరకాల నిత్యావసరాలు అందించేవాళ్లమని.. రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఎం మండిపడ్డారు. రూ. 1800 కోట్లు ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి మరీ అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనాల్లోనే బియ్యం రీ-సైక్లింగ్ చేశారన్నారు. ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు పదవులు తెచ్చుకుని.. రేషన్ బియ్యం మాఫియాకు పాల్పడ్డారని అన్నారు.

అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సి ఉంటుందని.. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపామన్నారు. రజక వర్గాన్ని తొలిసారిగా అసెంబ్లీకి తెచ్చామని వెల్లడించారు. అరకు కాఫీ బ్రాండ్‌ను మరింతగా వర్కవుట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అరకు కాఫీ బ్రాండ్‌ను మరింతగా ప్రమోట్ చేస్తే.. ఎస్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ అందించాలన్నారు. కుల వృత్తుల్లోకి వేర్వేరు కులాలు వారు వచ్చేస్తున్నారని.. బీసీలకు ఎకనమిక్ యాక్టివిటీని లింక్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Exit mobile version