తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 40 మందికి పైగా క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఇప్పటికే పలువురు మంత్రులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం జరిగిన బైరాగిపల్లె రామానాయుడు స్కూల్, పద్మావతి పార్క్‌కు చేరుకున్నారు. అధికారులు సీఎంకు ఘటన ఎలా జరిగింది? అనే అంశంపై వివరణ ఇచ్చారు. భద్రత ఏర్పాట్లు, తొక్కిసలాట గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ ఎక్కడ పెట్టారని ఆరా తీశారు. అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు.
READ MORE: Tirupati stampede: తిరుపతిలో రాత్రి ఏం జరిగింది? తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణాలు ఏంటి?
అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిని వదిలే సమస్యే లేదని హెచ్చరించారు. టీటీడీ అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త ప్రదేశంలో పంపిణీకి సిద్ధమైనప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. పలువురు అధికారులు సీఎంకి సమాధానం చెప్పారు. డిఎస్పీ వల్లే ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. భక్తులు మొదట ప్రశాంతంగానే ఉన్నారని.. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా డిఎస్పీ గేటు తెరవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు సమధానమిచ్చారు. అనంతరం సీఎం బాధితులను కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లారు.
READ MORE:PM Modi: మానవుడి భవిష్యత్త్ యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో ఉందంటూ రష్యా, ఇజ్రాయెల్‌లకు మోడీ చురకలు!