CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
- కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
- మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. మంగళ, బుధవారాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు చేయనున్నారు.
Also Read
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
- Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్‌పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- Vaibhav Sooryavanshi: ‘నన్ను విపరీతంగా బాధ పెట్టారు’.. వైభవ్ సూర్యవంశీ ఆవేదన..
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. రేపు సాయంత్రం 4.30కు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.
Also Read: MLC 2025: డికాక్ సూపర్ ఇన్నింగ్స్.. ఎంఎల్‌సీ విజేతగా ముంబై ఇండియన్స్!
బుధవారం కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. నార్త్ బ్లాక్లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఎల్లుండి సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు 17వ తేదీ ఉదయం 9.30కు ఢిల్లీ నుంచి అమరావతి రానున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
-
Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
-
Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
-
YS Jagan : రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
-
Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!