Atishi Marlena: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని బీజేపీ పార్టీకి సంబంధించిన గూండాలే చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ దాడికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన వారితో బీజేపీ నేతల సంబంధాలు ఉన్నాయని.. ఈ దాడి బాధ్యులుగా రోహిత్ త్యాగి, సాంకీ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లు బయటపెట్టారు ముఖ్యమంత్రి అతిశీ. ఈ సందర్బంగా ఆవిడ మాట్లాడుతూ..
Also Read: BJP: బీజేపీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు.. తేదీ ఖరారు!.. రేసులో ఎవరున్నారంటే?
శనివారం నాడు జరిగిన ఈ దాడి తీవ్రంగా రాజకీయ రంగంలో అలజడి సృష్టించిందని ఆవిడ పేర్కొన్నారు. కేజ్రీవాల్ తన ఇంటింటి ప్రచారంలో పాల్గొనగా, కొంతమంది దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. కాషాయ పార్టీకి చెందిన గూండాలు ఈ దాడికి పాల్పడ్డారని.. దాడికి పాల్పడిన రాహుల్ అలియాస్ సాంకీకి బీజేపీ పార్టీ నేత పర్వేశ్ వర్మతో సంబంధాలు ఉన్నట్లు ఆమె తెలిపింది. రాహుల్ అలియాస్ సాంకీ పై హత్యాయత్నం, దోపిడీ వంటి కేసులు కూడా ఉన్నాయని అతిశీ తెలిపారు.
Also Read: Mann Ki Bath : మహా కుంభమేళా, అంతరిక్షం, ప్రాణ ప్రతిష్ఠ… మోదీ ‘మన్ కీ బాత్’ ముఖ్యమైన అంశాలు
ఇది ఇలా ఉండగా ఈ దాడి అంశంపై బీజేపీ పార్టీ ఆ ఆరోపణలను ఖండించారు. ఆప్ నేతలు ఈ ఘటనను కావాలనే ఓటమి భయంతోనే బీజేపీ పార్టీకి సంబంధం కలిగి ఉందని అంటున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 8న ఫలితాలు వెలుబడుతాయి. చూడాలి మరి ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో.